తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు తరచుగా దర్శించుకుంటారు. అయితే, తొలిసారిగా హీరోయిన్ డింపుల్ హయాతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం నాదనీరాజనంలో అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.. ఈ నృత్య ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.