ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు సులభమైన చెల్లింపులకు, రివార్డులకు ఒక సాధనంగా మారాయి. కానీ, వాటిలోని రహస్య ఛార్జీలు నెమ్మదిగా మీ జేబును ఖాళీ చేస్తాయి. పూర్తి బిల్లు చెల్లింపునకు బదులుగా కనీస బకాయి చెల్లిస్తే, వడ్డీ రేటు సంవత్సరానికి 30-40% వరకు పెరుగుతుంది. సమయానికి బిల్లు చెల్లించకపోతే ఆలస్య రుసుముతో పాటు జీఎస్టీ కూడా జోడిస్తారు. నగదు అడ్వాన్సులపై ప్రత్యేక రుసుములు, తక్షణ వడ్డీ విధిస్తారు. అంతర్జాతీయ లావాదేవీలపై 1.5%-3% అదనపు ఛార్జీ, పరిమితికి మించిన ఖర్చులపై జరిమానా ఉంటాయి. ఈ దాగివున్న ఛార్జీలు చిన్న మొత్తాలలో పేరుకుపోయి, బిల్లు వచ్చేసరికి గణనీయంగా పెరుగుతాయి.