హిడ్మా ఎన్‌కౌంటర్.. కుట్ర పన్నింది తెలంగాణ కాంగ్రెస్ నేతనే!

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ వెనుక తెలంగాణ కాంగ్రెస్ నేత ఒకరు ప్రధాన సూత్రధారి అని మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. హిడ్మాను ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి, తెలంగాణ మీదుగా ఆంధ్రాకు కారులో తీసుకెళ్లి శత్రువులకు అప్పగించారని లేఖలో పేర్కొంది. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లు తమ వద్ద ఉన్నాయని మావోయిస్టు పార్టీ తెలిపింది. మాయమాటలు చెప్పి హిడ్మాను తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేశారని, వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్