జనసేనతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయిస్తుంది: రాంచందర్ రావు

తెలంగాణలో జనసేనతో పొత్తు అంశంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులపై ముందుకెళ్తామని, జనసేనతో పొత్తుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ‘మీట్ ది ప్రెస్’లో రాంచందర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పవన్ సభకు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించిన ఆయన, పవన్ సభ అనేసరికి BRS, INC గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని ఆ పార్టీలు యత్నిస్తున్నాయని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్