TG: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి నేతృత్వంలో న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రధాన ఆలయంలో మూలవిరాట్ శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి, సెషన్ కోర్ట్ న్యాయమూర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.