రిజర్వేషన్ల కేటాయింపుపై హైకోర్టు అసహనం

TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జనాభా లేని సామాజిక వర్గానికి సర్పంచ్ స్థానాన్ని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ఎస్టీ సామాజిక వర్గానికి 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని, దీంతో అసలు ఎస్టీ జనాభా లేని పంచాయతీల్లో కూడా సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలు ఎస్టీలకు కేటాయింపబడ్డాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందిస్తూ ఈ అంశంపై ఎలాంటి తీర్పు ఇచ్చినా తీవ్ర గందరగోళానికి దారి తీస్తుందని, దీనిపై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడింది.

సంబంధిత పోస్ట్