TG: కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కేటీఆర్ పిటిషన్‌పై ఆగస్టు 1న హైకోర్టు తీర్పు వెలువరించనుంది. MLC ఎన్నికల సమయంలో తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు BRS నేతలు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలపై మేడిపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్, జగదీశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.