మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హైడ్రామా.. వీడియో వైరల్

థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బోష్, మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్ నవాత్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫాతిమా ఒక షూట్‌కు హాజరుకాకపోవడంతో నవాత్ ఆమెను నిందించారు. దీనికి ఫాతిమా తీవ్రంగా స్పందించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. దాంతో ఫాతిమాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన పోటీదారులు వేదిక నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటన ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ కావడంతో నవాత్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్