పశుగ్రాసం వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుందని పశు వైద్యులు చెబుతున్నారు. విత్తనాలు నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుందని, పచ్చి మేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయని, సులభంగా జీర్ణం చేసుకుంటాయని పేర్కొన్నారు. పచ్చి మేత వలన పాల దిగుబడులు 25 శాతం వరకు పెరుగుతుందని, పశువుల్లో వ్యాధి కూడా నిరోధక శక్తి పెంపొందుతుంది. దాణా అవసరం లేకుండా కేవలం పచ్చి మేత ద్వారా 5 నుంచి 6 లీటర్ల పాల దిగుబడి సాధించవచ్చట.