దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత.. అకోలాలో 46.9 డిగ్రీలు

ఈ సంవత్సరం మార్చి నుంచే తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి, ఏప్రిల్‌లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ముఖ్యంగా అకోలా జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అకోలాలో ఏకంగా 46.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, ఇది దేశంలోనే అత్యధికం. అమరావతిలో 46.8, వార్ధాలో 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. విదర్భలోని మెజారిటీ ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. మంగళవారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్