బంగ్లాదేశ్‌లోని మైమన్సింగ్ జిల్లాలో 50 ఏళ్ల నిరంజన్ చంద్ర సూత్రధార్ అనే హిందూ వ్యాపారి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని నీటిలో తేలుతున్న ప్లాస్టిక్ డ్రమ్ములో పోలీసులు గుర్తించారు. మృతదేహంపై తీవ్ర గాయాలు ఉండటంతో, హత్య చేసి డ్రమ్ములో పెట్టి నీటిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిరంజన్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేశారు.