TG: ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల 'కంచం పొత్తా, మంచం పొత్తా' అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మాట్లాడారు. 'కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ రచించిన సామెతల పుస్తకంలో 'కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు' అనే సామెత ఉంది. కేసీఆర్ కూడా ఆమోదించి, దాని గొప్పతనంపై సందేశం కూడా ఇచ్చారు. సిగ్గులేదా అని మీ నాయనను చెప్పుతో కొట్టు కవిత' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.