HIV తల్లులూ పాలివ్వొచ్చు: అమెరికా

HIV తల్లులు పిల్లలకు స్తన్యమివ్వడంపై ఉన్న నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకటించింది. 1980లలో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. HIV కలిగిన తల్లులు పాలిస్తే శిశువుల్లోకి వైరస్ జొరబడి వారిని కూడా HIV రోగులుగా మారుస్తుందన్న ఉద్దేశంతో అప్పట్లో పిల్లలకు పాలివ్వడాన్ని నిషేధించారు. ఇప్పుడు మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో నిషేధాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్