బలమైన గాలులకు కూలిన హోర్డింగ్ ఫ్రేమ్.. తృటిలో తప్పించుకున్న బైకర్‌

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శనివారం రద్దీగా ఉండే రంజిత్‌సాగర్ రోడ్డుపై బలమైన గాలులకు ఒక హోర్డింగ్ ఫ్రేమ్ కూలిపోయింది. అదృష్టవశాత్తూ రోడ్డుపై వెళ్తున్న ఒక బైకర్ తల వంచి వేగంగా వెళ్ళిపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ముగ్గురు ప్రయాణిస్తున్న స్కూటీ రైడర్, అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వారు కూడా తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్