మహిళల హాకీ ప్రపంచ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. పూల్-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 6-1 తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభమైన 11వ నిమిషానికి సునేలిటా టొప్పో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. రెండో క్వార్టర్‌లో నవ్‌నీత్ కౌర్, సుశీలా చాను చెరో గోల్ చేశారు. ఇక మూడో భాగంలో దీపికా, లాల్రెమ్సియామి, రాణా సాక్షి తలో గోల్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.