పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే బిస్కెట్లలో ఉండే రంధ్రాలు కేవలం డిజైన్ కోసమే కాదని, వాటి తయారీలో ఇదొక ముఖ్యమైన భాగమని తెలుస్తోంది. బేకింగ్ సమయంలో గాలి, ఆవిరి సులభంగా బయటకు వెళ్ళడానికి, బిస్కెట్లు సమానంగా కాల్చడానికి ఈ రంధ్రాలు సహాయపడతాయి. వీటిని 'డాకింగ్ హోల్స్' అంటారు. ఈ రంధ్రాలు ఎక్కువగా క్రాకర్స్, సాల్టీ బిస్కెట్లలో కనిపిస్తాయి, తీపి బిస్కెట్లలో అంతగా ఉండవు.