దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకొంటారు. విదేశాల్లో కూడా తెలుగు వారు హోలీ వేడుకల్లో పాల్గొంటారు. పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంబరాలు జరుపుకొంటారు. బీహార్‌లో పండుగ రోజు జానపద పాటలు పాడుతూ... డ్యాన్స్ చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో రాధా, రాణి' ఆలయంలో 'లాఠ్ మార్ హోలీ' అనే ఆట ఆడతారు. బెంగాల్‌లో పెద్ద పట్టణాల వీధుల్లో శ్రీకృష్ణుడు, రాధ ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో హోలీ పండుగని 'షింగా' పేరుతో జరుపుకొంటారు.