‘హోలీ’ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం పబ్లిక్ హాలిడే ఉంది. తెలంగాణ, ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతబడనున్నాయి. శనివారం నుంచి రెండు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు, ఏపీలో ఉ.7.45 నుంచి మ.12.30 వరకు స్కూళ్లు నడుస్తాయి. పరీక్షల తర్వాత వేసవి సెలవులు ఉంటాయి.