హోలీ ఆడినంత ఈజీ కాదు ఆ రంగులను వదిలించుకోవడం. అయితే రంగులను సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. శెనగపిండిలో పాలు, పెరుగు, రోజ్ వాటర్‌కి బాదం నూనె కలిపి పేస్ట్ లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. తలకు అంటిన రంగులు పోవాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తల స్నానం చేయాలి.