నేటి జీవనశైలిలో మతిమరుపు సమస్య పెరుగుతోంది. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం మెదడు పనితీరును తగ్గిస్తాయి. అయితే, పాలకూర, పసుపు, వాల్ నట్స్, తృణధాన్యాలు, పెరుగు వంటి సహజసిద్ధమైన ఆహారాలతో జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో వండిన ఆహారంలో పోషకాలు మెదడుకు ఇంధనాన్ని అందిస్తాయి. డీహైడ్రేషన్ నివారించడానికి సరిపడా నీరు తాగాలి. ఖరీదైన టానిక్కులకు బదులుగా ఇంటి భోజనమే మెదడుకు శ్రీరామరక్ష అని, బయటి ఆహారానికి దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.