నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ లో విషాదం చోటు చేసుకుంది. విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. డ్యూటీ నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరిన కిషన్.. మార్గమధ్యంలో తీవ్రమైన గుండె నొప్పి రావడంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు.
అయితే అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందినట్లు సమాచారం. కిషన్ మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.