చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో చుండ్రు సమస్య ఒకటి. చుండ్రు రావడం వల్ల జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. విటమిన్ బి3, బి2, బి6, జింక్ లోపం వల్ల ఈ సమస్య వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె, నిమ్మరసంతో చుండ్రును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. రెండి టీ స్పూన్ల కొబ్బరి నూనెను, ఒక టీ స్పూన్ నిమ్మరసంతో కలిపి కొద్దిగా వేడి చేసి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా చుండ్రు సమస్యను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.