మహిళపై దాడి చేసిన హోం సర్వీస్ థెరపిస్ట్.. వీడియో వైరల్

ముంబై వడాలాలో హోం సర్వీస్ థెరపిస్ట్ ఓ మహిళపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మసాజ్ సెషన్ బుక్ చేసుకున్న 46 ఏళ్ల మహిళ.. అసౌకర్యంగా అనిపించడంతో సెషన్‌ను రద్దు చేసి రీఫండ్ కోరింది. అయితే థెరపిస్ట్ వెళ్లేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో థెరపిస్ట్ మహిళపై భౌతిక దాడికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్