అమ్మాయిల్లో ప్రధాన సమస్య అయిన జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఇంటి చిట్కాలు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అన్నం వండేటప్పుడు తీసిన గంజిలో కలోంజీ విత్తనాలు, మెంతులు కలిపి నానబెట్టి, ఆ నీటిని జుట్టుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గి, జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరుగుతుందని, రాలడం ఆగిపోతుందని తెలుస్తోంది. ఈ చిట్కాను మూడు రోజులకోసారి పాటిస్తే మంచి ఫలితాలుంటాయని, ఇది పాతకాలం నుంచి వస్తున్న సహజ పద్ధతి అని వివరించారు.