హోండా షైన్ 100DX, CB125 హార్నెట్ ధరలు విడుదలయ్యాయి. షైన్ DX ధర రూ.74,959గా, CB125 హార్నెట్ ధర రూ.1.12 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. షైన్ 100DXలో 98.98 CC ఇంజన్, మల్టీప్లేట్ వెట్ క్లచ్, సెల్ఫ్, కిక్ స్టార్ట్ ఆప్షన్లు ఉన్నాయి. హార్నెట్‌లో 123.94సీసీ ఇంజన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.