హోండా తన ఐకానిక్ మోడల్ 'మంకీ 125'ను 2026 వెర్షన్‌గా గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బైక్, పాత తరం క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే, నేటి తరం యువతను ఆకట్టుకునేలా సరికొత్త రంగుల్లో ముస్తాబైంది. యూరో 5+ కాలుష్య నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌ను అప్‌డేట్ చేశారు. 124cc ఇంజిన్‌తో 9.2bhp శక్తిని, 10.7Nm టార్క్‌ను అందిస్తుంది. గరిష్టంగా గంటకు 91 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మ్యాట్ గన్ పౌడర్ బ్లాక్, మిలీనియం రెడ్, బనానా యెల్లో వంటి మూడు కొత్త రంగుల్లో లభిస్తుంది.