మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌కు బెయిల్ లభించిన విషయం తెలిపిందే. అయితే సోనమ్ అరెస్ట్ సమయంలో పోలీసులు చేసిన తప్పిదం వల్లే ఆమెకు బెయిల్ మంజూరైనట్లు తాజాగా బయటకొచ్చింది. అరెస్ట్ సమయంలో తయారు చేసిన కీలక పత్రాలలో ఉనికిలో లేని చట్టపరమైన నిబంధనను పోలీసులు పేర్కొనడమే ఈ కేసులో కీలక మలుపునకు కారణమైంది. సెక్షన్ 403(1) కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు నమోదు చేశారు. అయితే అలాంటి సెక్షన్ ఒకటి లేదని కోర్టు స్పష్టం చేసింది.