హాంకాంగ్‌లోని థాయ్ పాలో బుధవారం ఎత్తైన నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 13 మంది మరణించగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిప్రమాదంలో ఇంకా అనేక మంది చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2000కు పైగా నివాసాలున్న భవనంలో చెలరేగిన మంటలు, దట్టమైన పొగ కారణంగా నివాసితులు బయటకు రాలేకపోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.