హాంకాంగ్‌ సిక్సెస్‌ టోర్నీ.. పాక్‌పై భారత్‌ విజయం

హాంకాంగ్‌ సిక్సెస్‌ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 ఓవర్లలో 86/4 పరుగులు చేసింది. ఉతప్ప 28, చిప్లి 24, కార్తిక్‌ 17* పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో షాజాద్‌ 2, సమద్‌ 1 వికెట్‌ తీశారు. అనంతరం ఛేదనకు దిగిన పాక్‌ 3 ఓవర్లలో 41/1 పరుగులు చేసింది. ఖవాజా 18*, సమద్‌ 16* పరుగులు చేశారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో, డీఎల్‌ఎస్‌ విధానం ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్