రాష్ట్రంలో పరువు హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఓ యువకుడు పరువు హత్యకు గురైన కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఏపీకి చెందిన మృతుడు శ్రవణ్ సాయి(19), కొన్నాళ్లుగా శ్రీజ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి తమ కూతురికి దూరంగా ఉండాలని యువతి తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అది కుదరదని శ్రవణ్ మొండిగా ఉండటంతో పెళ్లి గురించి మాట్లాడాలని చెప్పి ఫోన్ చేసి రప్పించారు. ఈ క్రమంలో యువతి తల్లితో గొడవ జరగ్గా.. ఆమె కోపంతో బ్యాటుతో యువకుడిని కొట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్