హైదరాబాద్ నగర శివారు ఘట్కేసర్-బోడుప్పల్ హైవేపై అర్ధరాత్రి పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్‌లపై వెంబడించి, భయబ్రాంతులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నా పట్టించుకోకుండా ఆకతాయిలు బైక్‌లను అడ్డంగా తిప్పుతూ, కేకలు వేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. నడిరోడ్డుపై జరుగుతున్న ఈ ఘటనలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, లా అండ్ ఆర్డర్ దారి తప్పిందని విమర్శలు గుప్పిస్తున్నారు.