ఇరాన్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. తమకు ఉన్న అత్త్యాధునిక 'హూట్ రాకెట్ టార్పెడో''ను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఈ ఆయుధం సముద్ర గర్భంలో 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ఇది 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధనౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేయగలదని ఇరాన్ వెల్లడించింది. త్వరలోనే దీనిని శత్రువుపై ప్రయోగిస్తామని తెలిపింది.