ఏపీలో ఘోరం.. కూతురిపై ఏడాది పాటు తండ్రి అత్యాచారం

AP: తూర్పు గోదావరి (D), ఉప్పలగుప్తం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారానికి  పాల్పడిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిగా బాలికను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక సోదరుడు సమాచారం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్