యజమానిపై కక్ష.. గ్యాస్ స్టవ్, సిలిండర్ ఎత్తుకెళ్లిన దంపతులు

TG: యజమాని తమను పనిలోంచి తొలగించాడని కోపంతో దంపతులు అతడి బైక్, గ్యాస్ స్టవ్, సిలిండర్‌ను ఎత్తుకెళ్లారు. ఏపీకి చెందిన మల్లెల కిరణ్, అతని భార్య రంగారెడ్డి జిల్లా అంకుషాపూర్‌ గ్రామానికి చెందిన పెరికాల ప్రవీణ్‌ ఫాంహౌస్‌లో నెల క్రితం పనిలో చేరారు. రూ. 25 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. పని సరిగా చేయడం లేదని యజమాని విధులకు రావద్దని చెప్పడంతో, ఈ నెల 16న దంపతులు యజమాని బైక్, స్టవ్, సిలిండర్‌ను ఎత్తుకెళ్లారు. వారం రోజులుగా స్పందించకపోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్