హాలీవుడ్ సినిమా సన్నివేశాలను తలపించే విధంగా హూతీ మిలిటెంట్లు 'మ్యాజిక్ సీస్' అనే భారీ ఓడను ఎర్రసముద్రంలో ముంచేశారు. హౌతీకి చెందిన మీడియా ఈ దృశ్యాలను విడుదల చేసింది. తుర్కియేకు భారీ సరకులతో వెళుతున్న ఓడను లక్ష్యంగా చేసుకుని హెలికాప్టర్, మిసైల్ దాడులతో నాశనం చేశారు. ఈ ఘటన ద్వారా అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరిక పంపినట్లు హూతీలు ప్రకటించారు.