ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీల ప్రవేశం

ఇరాన్‌కు మద్దతుగా యెమెన్‌కు చెందిన హౌతీలు యుద్ధంలోకి ప్రవేశించి, ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడి చేశారు. ఈ దాడిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకోగా, పెద్దగా నష్టం జరగలేదని నివేదికలు పేర్కొన్నాయి. అయితే హౌతీల ప్రవేశంతో మధ్యప్రాచ్య ఘర్షణ యెమెన్ వరకు విస్తరించి కీలక మలుపు తీసుకుంది. ఇరాన్‌పై దాడులు ఆపాలని, లేదంటే తమ దాడులు కొనసాగుతాయని హౌతీలు హెచ్చరించారు. దీంతో రెడ్ సీ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగి, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్