నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలతో పాటు కాలేయం కూడా డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా వెంకట్ కళ్లు తెరవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఫిష్ వెంకట్ కు మెరుగైన చికిత్స అందించేందుకు చిత్ర పరిశ్రమ సహకారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.