గురు పౌర్ణమి రోజున భక్తులు, శిష్యులు తమ గురువులను సందర్శించి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇంకా గురు పూజలో పుష్పాలు, పండ్లు, స్వీట్లు సమర్పిస్తారు. పాద పూజలో గురువుల పాదాలను శుభ్రం చేసి పూజిస్తారు. ధ్యానం, జపం చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవుతారు. సత్సంగంలో గురువులు జ్ఞాన బోధనలు చేస్తారు. పేదలకు ఆహారం, వస్త్రాలు దానం ఇస్తారు.