అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరింది. అయితే, ఇరాన్‌కు చెందిన స్తంభింపచేసిన ఆస్తుల విడుదల ఇరు దేశాల మధ్య ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, చర్చల ప్రారంభానికి ముందే అమెరికా 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయనుంది. 14 పాయింట్ల అవగాహన ఒప్పందంలో భాగంగా, 60 రోజుల చర్చల కాలంలో అమెరికా 24 బిలియన్ డాలర్లను విడుదల చేస్తుందని, అలాగే ఇరాన్ పునర్నిర్మాణ నిధుల కింద 300 బిలియన్ డాలర్లు అందించడానికి అమెరికా వాగ్దానం చేసిందని వార్తలు వస్తున్నాయి.