టీమిండియా మాజీ ప్రధాన కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి వైభవ్‌ను ఆసక్తికర ప్రశ్న వేశారు. “రోజూ మీరు ఎన్ని లీటర్ల పాలు తాగుతారు?” అని అడగగా, వైభవ్ సరదాగా స్పందిస్తూ “సార్, నేను ప్రస్తుతానికి పాలు తాగడం లేదు” అని చెప్పాడు. ఈ సమాధానం అక్కడ ఉన్నవారిని నవ్వుల్లో ముంచెత్తింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా, ఫ్యాన్స్ సైతం స్మైలీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.
VIDEO CREDIT: IPL