హెపటైటిస్ ఎన్ని రకాలు?

హెపటైటిస్ అనేది ఓ కాలేయ వ్యాధి. హెపటైటిస్ 5 రకాలు ఏ, బీ, సీ, డీ, ఈ. వీటిల్లో హెపటైటిస్ ఏ, ఈ అనేవి కలుషిత నీరు, ఆహారం ద్వారా సోకుతాయి. కలుషిత సిరంజిలు, సూదుల ద్వారా హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ సంక్రమిస్తుంది. హెపటైటిస్ బీతో బాధపడుతున్న రోగులలోనే హెపటైటిస్ డీ కూడా సంభవిస్తుంది. హెపటైటిస్ ఈ అనేది హెపటైటిస్ ఈ వైరస్ (హెచ్‌ఈవి) ఇన్ఫెక్షన్ వల్ల కలిగే కాలేయం యొక్క వాపు.

సంబంధిత పోస్ట్