జీడిపప్పును తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం చాలా మందికి తెలుసు. కానీ ఈ ఈ పప్పును తింటే బరువు పెరుగుతామని భయపడుతుంటారు. జీడిపప్పును వాస్తవానికి ఎక్కువగా తినాల్సిన పనిలేదు. దీన్ని రోజూ గుప్పెడు మోతాదులో లేదా 30 గ్రాముల మేర తింటే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి. గుప్పెడు జీడిపప్పును తింటే సుమారుగా 160 క్యాలరీల శక్తి లభిస్తుంది. 12 నుంచి 13 గ్రాముల మేర ఆరోగ్యకరమైన కొవ్వులు, 5 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి.