బ్యాంకు లాకర్లు, ఇంట్లో బంగారం ఎంత వరకు దాచుకోవచ్చు?

బ్యాంకు లాకర్లలో బంగారం భద్రతకు ఆర్‌బీఐ గరిష్ఠ పరిమితి విధించలేదు. లాకర్ సామర్థ్యం మేరకు బంగారం ఉంచుకోవచ్చు. అయితే, బ్యాంకు నిర్లక్ష్యం, చోరీ, అగ్నిప్రమాదం లేదా సిబ్బంది మోసం వంటి కారణాలతో నష్టం జరిగితే, వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు మాత్రమే పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు, రూ.3,000 అద్దె చెల్లిస్తే గరిష్ఠంగా రూ.3 లక్షలు మాత్రమే వస్తాయి. భారీ విలువైన బంగారానికి ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇంట్లో బంగారం విషయంలో, ఆదాయపు పన్ను మార్గదర్శకాల ప్రకారం వివాహిత మహిళ 500 గ్రాములు, అవివాహిత మహిళ 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. అయితే, కొనుగోలు బిల్లులు, వారసత్వ పత్రాలు లేదా ఆదాయ ఆధారాలు ఉంటే ఎక్కువ బంగారాన్ని కూడా చట్టబద్ధంగా కలిగి ఉండవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్