ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025–26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలపై 8.25% వడ్డీ రేటును కొనసాగిస్తోంది. పీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష బ్యాలెన్స్ ఉంటే సంవత్సరానికి సుమారు రూ.8,250 వడ్డీ లభిస్తుంది. రూ.5 లక్షలు ఉంటే సుమారు రూ.41,250, రూ.10 లక్షలు ఉంటే దాదాపు రూ.82,500 వడ్డీ వస్తుంది. పీఎఫ్ వడ్డీని నెలవారీగా లెక్కించినప్పటికీ, ఆర్థిక సంవత్సరం చివరలో ఖాతాలో జమ చేస్తారు. ఇలా జమ అయిన వడ్డీ కూడా అసలు మొత్తంలో కలిసిపోవడంతో వచ్చే సంవత్సరాల్లో మరింత వడ్డీ లభిస్తుంది.