ఆర్బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకులు బంగారం విలువలో 75% నుండి 85% వరకు రుణం ఇస్తాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం విలువ రూ.1,40,000 అయితే, మీరు రూ.1,05,000 నుండి రూ.1,19,000 వరకు రుణం పొందవచ్చు. బంగారు రుణాలపై వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాల కంటే తక్కువగా ఉంటాయి, సాధారణంగా 8.5% నుండి 12% వరకు ఉంటాయి. EMI ప్రతి నెలా అసలు, వడ్డీతో సహా చెల్లించవచ్చు. ప్రతి నెలా వడ్డీ మాత్రమే చెల్లించే సౌకర్యం కూడా ఉంది. రుణం తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు, బ్యాంక్ నిబంధనలు, సకాలంలో చెల్లింపులు వంటివి గుర్తుంచుకోవాలి.