తిరుపతి తొక్కిసలాట ఘటన ఎలా జరిగిందంటే..!

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం ఇవాళ సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతగురి కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు క్యూలైన్‌ ఓపెన్‌ చేయడంతో ఒక్కసారిగా అంతా దూసుకురావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్‌, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్