వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకు జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా రావడం జరుగుతుంది. అంతేకాక వచ్చిన పిలకలు సరిగా పెరగక పైరు ఎదగక గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.