ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ పనీర్ ఎక్కువగా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అసలైన పనీర్‌ను గుర్తించడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చిన్న ముక్క పనీర్‌ను వేడి నీటిలో 5 నిమిషాలు ఉడకబెట్టి, దానిపై అయోడిన్ టింక్చర్ వేయండి. రంగు నీలంగా మారితే అది కల్తీ పనీర్ అని అర్థం. కల్తీ పనీర్‌లో స్టార్చ్, నూనె, డిటర్జెంట్, రసాయనాలు ఉంటాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, లివర్, కిడ్నీలకు హాని కలగొచ్చు.