ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ప్రాణాలు కాపాడుకోండిలా!

మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడితో గుండెపోటు ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే తక్షణ సహాయం కోసం 108కు కాల్ చేయాలి. వైద్యుడికి తెలియజేసి, ఆస్ప్రిన్ టాబ్లెట్ నమలాలి. ఇంటి తలుపు తెరిచి, సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. తల తిరుగుతుంటే ఎడమ వైపుకు తిరిగి కాళ్ళు ముడుచుకుని పడుకోవాలి. ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ, సహాయం అందబోతుందని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్