'టెర్మినేషన్ నోటీసులు' పంపించి ఉద్యోగులకు షాకిచ్చిన HR.. తీరా చూస్తే!

ఒక సంస్థలో జరిగిన విచిత్ర ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త ఆఫ్‌బోర్డింగ్ సిస్టమ్‌ను టెస్ట్ చేస్తుండగా, హెచ్‌ఆర్‌ అనుకోకుండా సీఈవోతో పాటు మొత్తం 300 మంది ఉద్యోగులకు “టెర్మినేషన్ నోటీసు” ఈమెయిల్‌ పంపింది. “మీ చివరి పని దినం ఇవాళే” అని పేర్కొన్న ఈమెయిల్ చూసి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఐటీ విభాగం వివరణ ఇచ్చి, ఇది పొరపాటున జరిగింది అని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నెటిజన్‌లు ఫన్నీగా స్పందిస్తూ, “ఇలాంటివి నా ఆఫీసులో జరగాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్